కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రముఖ బెంగాలీ నటి నుస్రత్ జహాన్ పెళ్లిపీటలెక్కారు. ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ జైన్ ను వివాహం చేసుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బసీర్హత్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు నుస్రత్ జహాన్. 

అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో టర్కీలో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న ఫోటోలను నుస్రత్ జహాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పెళ్లి జరిగిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. 

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపు మేరకు గత ఏడాది నుస్రత్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఇకపోతే లోక్‌ సభ ఎన్నికల్లో మమత బెనర్జీ 17 మంది మహిళలకు టికెట్లు ఇచ్చారు. వారిలో నుస్రత్‌ కూడా ఒకరు కావడం విశేషం.