షాకింగ్ న్యూస్.. కరుణానిధి విగ్రహం తొలగింపు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 10, Aug 2018, 10:05 AM IST
First statue of M Karunanidhi removed for want of sanction
Highlights

రెవెన్యూశాఖ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ విగ్రహాన్ని తొలగించారు. అనంతరం దానిని కృష్ణమూర్తికి అప్పగించారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి , డీఎంకే అధినేత  కరుణానిధి విగ్రహాన్ని అధికారులు తొలగించారు. అనుమతి లేకుండా నిర్మించారనే కారణంతో దానిని తొలగించినట్లు పోలీసులు తెలిపారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కుడియాత్తం ఉత్తర డీఎంకే ప్రతినిథి కృష్ణమూర్తి కరుణానిధి మరణ వార్త విని మనస్తాపానికి గురయ్యారు. ఈ మేరకు ఆయన వినాయకపురంలో పార్టీ జెండా, రెండున్నర అడుగుల కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాయితో తయారైన ఈ విగ్రహానికి బంగారు రంగు పూత వేయించి, పీఠానికి ఇరువైపుల స్టాలిన్‌, దురైమురుగన్‌ పటాలను ఏర్పాటు చేశారు. 

కరుణానిధి విగ్రహాన్ని చూసిన ప్రజలు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న రెవెన్యూశాఖ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ విగ్రహాన్ని తొలగించారు. అనంతరం దానిని కృష్ణమూర్తికి అప్పగించారు. అనుమతి తీసుకుని తిరిగి కరుణానిధి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని కృష్ణమూర్తి ప్రకటించారు.

loader