భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజుకి నాలుగు లక్షల పైచిలుకు కేసులు నమోదవుతుండడంతోపాటుగా.... వేలల్లో జనాలు మృత్యువాత పడుతున్నారరు. అధికారిక లెక్కలే భయం గొలిపేలా ఉంటే... అనధికారిక లెక్కలు వాటికి మరిన్ని రెట్లు ఎక్కువ ఉండొచ్చని అంచనా. 

ఇక దేశంలో మందులు, ఆక్సిజన్, ఆసుపత్రి బెడ్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశమంతా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రపంచ దేశాలు భారతదేశానికి ఈ ఆపత్కాలీన సమయంలో సహాయం అందించడానికి ముందుకొచ్చాయి. 

తాజాగా కొరియా దేశం నుండి భారతదేశానికి మెడికల్ సామాగ్రి వచ్చాయి. 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 200 సిలిండర్లను భారతదేశానికి మొదట విడతగా కొరియా పంపించింది. మరో 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, నెగటివ్ ప్రెజర్ స్ట్రెచర్లను మే 12వ తేదీన కొరియా భారతదేశానికి పంపనుంది. 

ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితులను కనీసం కొంతమేరైనా ఇవి తగ్గించగలవాని కొరియా రాయబారి ఆశాభావం వ్యక్తం చేసారు. భారతదేశానికి ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో కొరియా పూర్తి సహాయసహకారాలను అందిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

ఇకపోతే... కరోనా విలయానికి దేశం మొత్తం చిగురుటాకులా విలవిలలాడుతోంది. లక్షల మందిపై మహమ్మారి విరుచుకు పడుతూనే ఉంది. వేల మందిని పొట్టన పెట్టుకుంటోంది. 24 గంటల వ్యవధిలో 3.66లక్షల మంది కోవిడ్ బారినపడ్డారు. 

అంతక్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు దాదాపు 35 వేలకు పైగా తగ్గడం గమనార్హం. అయితే నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆదివారం కేవలం 14.7 లక్షల మందికే వైద్య పరీక్షలు చేశారు. అంతక్రితం రోజున 18.6 లక్షల మంది టెస్టులు చేయించుకున్నారు. 

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకూ 14,74,606 మందికి కరోనా పరీక్షలు చేయించుకోగా.. 2,66,161 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.2 కోట్లకు చేరింది.

ఇదే సమయంలో 3,754 మంది కరోనాతో వృద్ధుడికి చేరుకున్నారు. దీంతో వైరస్ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 2, 46,116 మందిని కోవిడ్ బలితీసుకుంది. మరణాల రేటు 1.09 శాతంగా ఉంది. 

అయితే కొత్త కేసులతో పాటు, రికవరీలు కూడా ఎక్కువగానే ఉండడం కాస్త సానుకూల పరిణామం. గడిచిన 24 గంటల్లో 3,53,818 మంది కరోనాను జయించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1.86 కోట్లకు చేరగా.. రికవరీ రేటు 82.15 శాతానికి పెరిగింది.