మధ్యప్రదేశ్ లో బుధవారం SARS-CoV-2 డెల్టా ప్లస్ వేరియంట్‌తో ఓ మహిళ మృతి చెందింది. మధ్యప్రదేశ్ లో ఐదుగురికి డెట్లా ప్లస్ వేరియంట్ సోకగా, నలుగురు కోలుకున్నారు. ఒకరు మృతి చెందారని ఉజ్జయిని నోడల్ కోవిడ్ అధికారి తెలిపారు.
మధ్యప్రదేశ్ లో బుధవారం SARS-CoV-2 డెల్టా ప్లస్ వేరియంట్‌తో ఓ మహిళ మృతి చెందింది. మధ్యప్రదేశ్ లో ఐదుగురికి డెట్లా ప్లస్ వేరియంట్ సోకగా, నలుగురు కోలుకున్నారు. ఒకరు మృతి చెందారని ఉజ్జయిని నోడల్ కోవిడ్ అధికారి తెలిపారు.
ఉజ్జయినిలో మరణించిన కోవిడ్ రోగి నుండి తీసిన నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ తో ఆమెకు డెల్టా ప్లస్ వేరియంట్ సంక్రమించినట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్ లో ఇప్పటికే ఐదు డెల్టా వేరియంట్ గుర్తించబడ్డాయి. వీటిల్లో మూడు భోపాల్ లో, రెండు ఉజ్జయినిలో నమోదయ్యాయి.
డెల్టా ప్లస్ వేరియంట్ సంక్రమించిన ఐదుగురు కోవిడ్ రోగులలో, నలుగురు కోలుకోగా, ఒక మహిళ మృతి చెందింది. భోపాల్ లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను ధృవీకరించిన నివేదికలే ఉజ్జయినీలోనూ రెండు కేసులను ధృవీకరించాయని ఉజ్జయిని నోడల్ కోవిడ్ ఆఫీసర్ డాక్టర్ రౌనక్ అన్నారు.
ఉజ్జయినిలో డెల్టా ప్లస్ వేరియంట్ బారిన పడిన కోవిడ్ బాధితురాలు మే 23 న మరణించిందని డాక్టర్ రౌనక్ తెలిపారు. ఆమె భర్త కూడా కోవిడ్ -19 పాజిటివ్ బారిన పడ్డాడని తెలిపారు. కాగా భర్తకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని, మృతురాలు ఇంకా టీకా తీసుకోలేదని తెలిపారు.
మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వస్ సారంగ్ మాట్లాడుతూ "ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన రోగుల కాంటాక్ట్ ట్రేసింగ్ జరిగింది. వారి కాంటాక్ట్ లో ఉన్నవారికి నెగటివ్ వచ్చింది’’ అని తెలిపారు.
"అయినా కూడా, ప్రభుత్వం అన్ని ఆసుపత్రులకూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ కేసుల గుర్తింపులో ఎలాంటి ఆలస్యం జరగకుండా, భారీ స్థాయిలో పరీక్షలు, జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నాం" అని మంత్రి సారంగ్ చెప్పారు.
"డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్న ఐదుగురిలో నలుగురు వ్యాక్సిన్ వేయించుకున్నారని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. టీకా తీసుకోని మహిళ మరణించిందని. అందుకే ప్రతి ఒక్కరికి టీకాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం " అన్నారు.
