న్యూఢిల్లీ: ఈ నెల 13వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పారు.

మంగళవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు దేశంలోని నాలుగు ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ నిల్వ చేసే ప్రదేశాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. కోల్‌కత్తా, కర్నాల్, ముంబై, చెన్నైలలో జీఎంఎస్‌డిగా ఈ వ్యాక్సిన్ నిల్వ చేసే స్టోరేజీ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు.

 

దేశంలోని 37 చోట్ల వ్యాక్సిన్ స్టోర్లు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన తెలిపారు.దేశవ్యాప్తంగా 29 వేల కోల్డ్ చైన్లను ఏర్పాటు చేసినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ కార్మికులు, తమను తాము కరోనా వ్యాక్సిన్ కోసం లబ్దిదారుడిగా నమోదు చేయాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ సెక్రటరీ చెప్పారు. 

దేశ వ్యాప్తంగా చేపట్టిన డ్రైరన్ విజయవంతమైన తర్వాత   టీకాల పంపీణీకి కేంద్రం రంగం సిద్దం చేసింది.దేశంలో అత్యవసర వినియోగం కోసం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలకు ఈ నెల 3వ తేదీన డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.   టీకాల వినియోగం విషయంలో డ్రైరన్ ను కూడ ఈ నెల 2 వతేదీన నిర్వహించారు. డ్రైరన్ విజయవంతం కావడంతో వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.