దేశ రాజధాని నగరంలోనే కోర్టు లోపల కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపింది. కాల్పులు జరిపిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఉన్న కోర్టు లోపల సోమవారం రాత్రి కాల్పులు జరిగాయి. కోర్టు ఛాంబర్ లోపల పలువురు న్యాయవాదలు, కక్షి దారుల సమక్షంలోనే న్యాయవాది అరుణ్ శర్మ తన తుపాకీతో కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో ఉప్ కార్ అనే వ్యక్తి బుల్లెట్ గాయాలతో మరణించారు. కోర్టులో కాల్పులు జరిపిన నిందితుడు పారిపోయాడు. ఈ కాల్పుల్లో ఓ కేసులో విచారణకు వచ్చిన ఉప్ కార్ మరణించారు.

దేశ రాజధాని నగరంలోనే కోర్టు లోపల కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపింది. కాల్పులు జరిపిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.