పంజాబ్  రాష్ట్రంలోని  భటిండా  మిలటరీ  స్టేషన్ లో  ఇవాళ ఉదయం  కాల్పులు  చోటు  చేసుకున్నాయి. 


చంఢీఘడ్::పంజాబ్ రాష్ట్రంలోని భటిండా మిలటరీ స్టేషన్ లో బుధవారంనాడు ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. భటిండా మిలటరీ స్టేషన్ లోపల కాల్పులు జరిగిన విషయాన్ని అధికారులు ధృవీకరించారు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టినట్టుగా ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ ప్రకటించింది. 

మిలటరీ స్టేషన్ వెలుపల ఒక పోలీస్ బృందం ఎదురు చూస్తుంది. అయితే పోలీసులను భటిండా మిలటరీ స్టేషన్ లోకి ఆర్మీ అనుమతించలేదని భటిండా సీనియర్ పోలీస్ సూపరింటెండ్ జీఎస్ ఖురానా మీడియాకు చెప్పారు.

 భటిండా మిలటరీ స్టేషన్ నుండి రెండు రోజుల క్రితం రైఫిల్, బుల్లెట్లు అదృశ్యమయ్యాయి. ఈ విషయమై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ సమయంలోనే ఇవాళ తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్నాయి. భటిండా మిలటరీ స్టేషన్ లో కాల్పుల ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్మీ అధికారులు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరాలు అందించనున్నారు. ఇదిలా ఉంటే సమీప గ్రామాల ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దని ఆర్మీ అధికారులు సూచించారు.