అమెరికాలోని ఫ్లొరిడా అడవిలో కార్చిచ్చు చెలరేగుతోంది. ఈ కార్చిచ్చు వల్ల చాలా వీస్తీర్ణంలోని ఆడవి కాలి బూడిద అవుతోంది. ఇప్పటి వరకు ా దాదాపు 6,070 హెక్టార్ల అడవి కాలిపోయింది. ఈ మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
వాషింగ్టన్ : అమెరికాలోని ఆగ్నేయ రాష్ట్రమైన ఫ్లోరిడా అడవిలో మంటలు చెలరేగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 15,000 ఎకరాలకు పైగా (దాదాపుగా 6,070 హెక్టార్లు) అడవి దగ్ధం అయ్యింది. దీనిని ఫ్లోరిడాలోని స్థానిక అధికారులు పెద్ద విపత్తుగా పిలుస్తున్నారు.
ఫ్లోరిడా ఫారెస్ట్ లో చెలరేగుతున్న మండలను అదుపులోకి తెచ్చేందుకు వైల్డ్‌ల్యాండ్ అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సేవా విభాగాల సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారని వార్తా సంస్థ జిన్హువా నివేదించింది.
ఈ అగ్రిప్రమాదం వల్ల ఫ్లోరిడాలోని బే కౌంటీలో ప్రాంతంలో ఉన్న దాదాపు 1,100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అడ్కిన్స్ అవెన్యూలో జరిగిన అగ్నిప్రమాదంలో శుక్రవారం రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇందులో 12 మందిగి గాయాలు అయ్యాయని వార్తా సంస్థ AP తెలిపింది.
మరో వార్తా సంస్థ IANS నివేదిక, ఫ్లోరిడా ఫారెస్ట్ సర్వీస్ ప్రకారం.. ‘‘ స్థిరమైన గాలులు, పొడిగా, దట్టంగా చనిపోయిన చెట్లు ఉండటంతో ఈ మంటలు మరింతగా వ్యాపిస్తున్నాయని, గత రెండు రోజుల నుంచి ఇవి మరింతగా ఎక్కువయ్యాయని తెలిపాయి.
2018లో అమెరికాలో తీరాన్ని తాకిన్న హరికేన్ కూడా ప్రస్తుత మంటలకు ఓ కారణం అవుతోంది. ఆ సమయంలో వచ్చిన హరికేన్ యూనైటెడ్ స్టేట్స్ లో 16 మంది మరణించారు. దాదాపు 25 డాలర్ల నష్టాన్ని చేకూర్చింది. అయితే ఈ హరికేన్ ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్‌లో 2.8 మిలియన్ ఎకరాల (దాదాపు 1.1 మిలియన్ హెక్టార్లు) చేట్లను నేలకూల్చింది. ఆ చెట్లు పొడిగా ఆ ప్రాంతంలో పడి ఉన్నాయి. ఆ చనిపోయన చెట్ల వల్ల ఇప్పుడు మంటలు విపరీతంగా చెలరేగుతున్నాయని అధికారులు తెలిపారు.
