గ్రేటర్ నోయిడాలో అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని ఓ ప్రైవేట్ మేంథాల్ గోడౌన్‌లో ఈ సోమవారం అర్థరాత్రి 12.30 ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. క్షణాల్లో గోడౌన్ మొత్తం వ్యాపించాయి.

నోయిడా, ఘజియాబాద్ నగరాల నుంచి మొత్తం 20 అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.. అయితే భారీగా ఆస్తినష్టం మాత్రం సంభవించింది.

ఈ గోడౌన్‌లో నిల్వ చేసే మేంథాల్‌ను ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు సరఫరా చేస్తారు. దీనిని హెర్బల్ ప్రొడక్ట్స్‌లో సహజ నూనెగా వినియోగిస్తారు. దీనికి మండే స్వభావం ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత భారీగా ఉందని నిపుణులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.