మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ బహుళ అంతస్థుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ బహుళ అంతస్థుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ భవనంలో మంటలు వ్యాపించాయని అధికారులు అనుమానిస్తున్నాయి. మంటలు వ్యాపించిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

నవీ ముంబైలోని భారీ అంతస్థుల భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఐదు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పుతున్నాయి.ఈ భవనంలో ఫైర్ సేఫ్టీ మేజర్స్ తీసుకొన్నారా లేదా అనే విషయమై కూడ అధికారులు ఆరా తీస్తున్నారు.గతంలో కూడ నగరంలో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.

వీటిల్లో కొన్ని ప్రమాదాలు భారీ నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కూడ మిగిల్చాయి. ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకొంటే తరచూ ప్రమాదాలు జరిగేవి కావు. కానీ అధికారుల ఉదాసీనత కూడ ఈ ప్రమాదాలకు కారణమనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. బహుళ అంతస్థుల భవనాల నిర్మాణలకు అనుమతులు ఇచ్చే సమయంలో నిబంధనలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను తగ్గించే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.