కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎయిర్‌పోర్ట్‌లోని విస్తారా కౌంటర్‌కు ఎదురుగా వున్న డిపార్చర్ లాంజ్లో రాత్రి9.20 గంటల ప్రాంతంలో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. కాసేపటికే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. హుటాహుటిన స్పందించిన భద్రతా సిబ్బంది లాంజ్‌లో వున్న ప్రయాణీకులను ఖాళీ చేయించి మంటలను అదుపు చేసేందుకు యత్నించారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో మరిన్ని ఫైరింజన్లు విమానాశ్రయానికి చేరుకుంటున్నాయి. అగ్ని ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయంలోకి విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ప్రమాదానికి దారి తీసిన కారణాలు మాత్రం తెలియరాలేదు. 

Scroll to load tweet…