Gorakhpur: ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో మహిళ, నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Uttar Pradesh Fire accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో మహిళ, నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని కుషీనగర్ జిల్లాలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 30 ఏళ్ల దివ్యాంగురాలు, ఆమె నలుగురు పిల్లలు మృతి చెందారు. మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సహా మరో ముగ్గురికి కాలిన గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. రామ్కోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మాఘి మథియా గ్రామంలోని ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు రోడ్డుకు అడ్డంగా ఉన్న మూడు పక్కా ఇళ్లకు వ్యాపించాయని జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) రమేశ్ రంజన్ తెలిపారు.
షేర్ మహమ్మద్ అనే వ్యక్తి ఇంట్లో భార్య ఫాతిమా, వారి నలుగురు పిల్లలు రోఖీ (6), అమీనా (4), ఆయేషా (2), రెండు నెలల ఖదీజా నిద్రిస్తుండగా మంటలు చెలరేగాయి.ఆ మహిళ తప్పించుకునేందుకు ప్రయత్నించినా మంటలు గది ప్రవేశద్వారాన్ని చుట్టుముట్టడంతో విఫలమైంది. వారంతా సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. మృతురాలి మామ షఫీక్ (70), అత్త మోతీరాణి (67) మరో గదిలో నిద్రిస్తున్నారు. వారు తప్పించుకోగలిగారని, అయితే కాలిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో పక్కింటి వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. ముగ్గురూ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని, బాధితులకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని రంజన్ తెలిపారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందేలా చూడాలని, వారు త్వరగా కోలుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
