Asianet News TeluguAsianet News Telugu

ముంబైలో అగ్నిప్రమాదం.. అనేక దుకాణాలు దగ్ధం..

ముంబైలోని మసీదు బందర్ ప్రాంతంలోని భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనంలో మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

Fire Breaks Out In Two-Storey Building In Masjid Bunder Area Of South Mumbai
Author
First Published Jan 8, 2023, 2:56 AM IST

ముంబైలోని మసీదు బందర్ ప్రాంతంలోని రెండంతస్తుల భవనంలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు దుకాణాలు దగ్ధమయ్యాయి. రాత్రి 8.15 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు.

అబ్దుల్ రెహ్మాన్ స్ట్రీట్ , జంజికర్ స్ట్రీట్ జంక్షన్ వద్ద జుమా మసీదు సమీపంలోని ఓ బహుళ అంతస్థుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. భవనంలో మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. తొలుత ఒక దుకాణానికి మంటలు అంటుకున్నాయని, ఆ తర్వాత సమీపంలోని 20 దుకాణాలకు మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇంతలో, భవనంలో జరిగిన అగ్నిప్రమాద సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ప్రజలు మంటలను ఆర్పడానికి బకెట్లను విసిరివేయడాన్ని చూడవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios