దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముంద్క ఏరియాలోని ఓ గోదాంలో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ గోదాంకు ఎదురుగా ఉన్న బల్బుల ఫ్యాక్టరీకి మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. 

మంటలను అదుపు చేసేందుకు 21 ఫైరింజన్లు యత్నిస్తున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే ఢిల్లీలోని అనాజ్‌మండీలో అక్రమంగా నిర్వహిస్తున్న బ్యాగ్, పేపర్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి 43 మంది సజీవదహనమైన విషయం విదితమే. 62 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మరువక ముందే మరో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.