ఢిల్లీలో  ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చినట్టుగా అధికారులు తెలిపారు. 

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ గోకుల్‌పురి ప్రాంతంలోని (Gokulpuri area) మురికివాడల్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చినట్టుగా అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 

దాదాపు 60 గుడిసెలకు మంటలు అంటుకున్నాయని అర్ధరాత్రి 1 గంటలకు కాల్ వచ్చిందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మొత్తం 13 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని తెలిపింది. ఇక, ఘటన స్థలంలో కాలిపోయిన ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎట్టకేలకు తెల్లవారుజామున 4 గంటలకు మంటలు ఆర్పివేశామని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) దేవేష్ కుమార్ మహ్లా తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.