Breaks Out Near BKC Metro Station : ఎంట్రీ/ఎగ్జిట్ A4 వెలుపల అగ్నిప్రమాదం కారణంగా శుక్రవారం బీకేసీ స్టేషన్‌లో ముంబై మెట్రో సేవలు తాత్కాలికంగా ఆగిపోయాయి. అయితే మిగిలిన ముంబై మెట్రో లైన్ 3 పనిచేస్తోంది.
Breaks Out Mumbai BKC Metro Station : బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) మెట్రో స్టేషన్ లో శుక్రవారం మధ్యాహ్నం 1.09 గంటలకు మంటలు చెలరేగాయి. మంటలు ఆ ప్రాంతంలోని చెక్క నిల్వ, ఫర్నిచర్ కు వ్యాపించడంతో ప్రమాదం మరింతగా పెరిగింది. సమాచారం అందుకున్న అధికారులు అగ్నిమాపక చర్యలు చేపట్టారు. ముంబైలోని బీకేసీ స్టేషన్ లోని ఎంట్రీ/ఎగ్జిట్ ఏ4 వెలుపల చెలరేగిన మంటల నుంచి పెద్దఎత్తున పొగలు రావడంతో ప్రయాణికుల సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రత్యామ్నాయంగా బాంద్రా కాలనీ స్టేషన్ ను ఉపయోగించుకోవాలని ప్రయాణికులను అధికారులు కోరారు.
BKC మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్న ఆదాయపు పన్ను కార్యాలయానికి సమీపంలో ఉన్న చెత్త కుప్పలో మొదట మంటలు చెలరేగాయని BMC తెలిపింది. నివారన చర్యల కోసం BKC మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు పేర్కొన్న అధికారులు.. ముంబై మెట్రో లైన్ 3 లో మిగిలిన భాగం పూర్తిగా పనిచేస్తోందని పేర్కొన్నారు.
"ఎంట్రీ/ఎగ్జిట్ A4 వెలుపల అగ్నిప్రమాదం కారణంగా BKC స్టేషన్‌లోని ప్రయాణీకుల సేవలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. అగ్ని ప్రమాదం కారణంగా స్టేషన్‌లోకి పొగ ప్రవేశించింది. ప్రయాణీకుల భద్రత కోసం, మేము సేవలను నిలిపివేశాము. దయచేసి ప్రత్యామ్నాయ బోర్డింగ్ కోసం బాంద్రా కాలనీ స్టేషన్‌కు వెళ్లండి" అని MMRC ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ అగ్ని ప్రమాదంలో
ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని BMC తెలిపింది.
