ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో శుక్రవారం నాడు మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఓ స్క్రాప్ యార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.అగ్ని ప్రమాదం చోటు చేసుకొన్న ప్రాంతంలో భారీగా మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించింది.

ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు ఫైరింజన్లకు సమాచారం ఇచ్చారు. 10 ఫైరింజన్లు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్క్రాప్ యార్డుకు సమీపంలోనే మురికవాడల్లో పేదలు నివాసం ఉంటున్నారు. ఈ మంటలు బస్తీల వైపు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఫైరింజన్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ స్క్రాప్ యార్డులో అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏమిటనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.