దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టంగా ఉండే ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సుమారు 9 ఫైరింజన్లు మోడీ నివాసానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఎస్పీజీ ఏరియాలో మంటలు చెలరేగాయని.. ప్రస్తుతం పరిస్ధితి అదుపులోకి వచ్చినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.