ముంబైలోని పారెల్ వద్ద గల హింద్ మత సినిమా వద్ద ఉన్న క్రిస్టల్ టవర్ రెసిడెన్షియల్ అపార్టుమెంటులోని 12వ అంతస్థులు మంటలు చెలరేగాయి. బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

ముంబై: ముంబైలోని పారెల్ వద్ద గల హింద్ మత సినిమా వద్ద ఉన్న క్రిస్టల్ టవర్ రెసిడెన్షియల్ అపార్టుమెంటులోని 12వ అంతస్థులు మంటలు చెలరేగాయి. బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఓ మహిళ ఉంది.

సంఘటనా స్థలానికి 20 ఫైర్ టెండర్స్ చేరుకున్నాయి. అవి మంటలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయి. అపార్టుమెంటు లోపల నివాసితులు చిక్కుకున్నారు. క్రేన్ ల సహాయంతో వారిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు.

లోపలి నుంచి బయటకు తీసినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనం 12వ అంతస్థులో ప్రారంభమైన మంటలు 14, 15 అంతస్థులకు వ్యాపించాయి.

మొత్తం 20 మంది బాధితులను కెఈఎం ఆస్పత్రికి తరలించగా, వారిలో నలుగురు మరణించారు. మిగతా 16 మందిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమేమిటనేది తెలియదు.

Scroll to load tweet…