పుణె గణపతి మండపంలో అగ్ని ప్రమాదం: సురక్షితంగా బయటపడ్డ జేపీ నడ్డా
పుణెలో గణపతి మండపంలో అగ్ని ప్రమాదం జరిగింది.ఆ సమయంలో అక్కడే ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకు వచ్చారు.

పుణె: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మహారాష్ట్రలోని పుణెలో తృటిలో ప్రమాదం తప్పింది.పుణెలోని సానే గురూజీ తరుణ్ మిత్ర మండల్ లో గణపతికి హరతి ఇచ్చే కార్యక్రమం సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ విషయాన్ని గుర్తించిన జేపీ నడ్డా సెక్యూరిటీ సిబ్బంది ఆయనను జాగ్రత్తగా అక్కడి నుండి బయటకు తీసుకు వచ్చారు.
ఉజ్జయినిలోని ప్రసిద్ద మహాకాల్ దేవాలయం నమూనాలో రూపొందించిన గణపతి మండల్ పై భాగంలో మంటలు చెలరేగాయి.దీంతో జేపీ నడ్డాను సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు.అగ్ని ప్రమాదం ప్రారంభమైన కొద్దిసేపటికే బారీ వర్షం కురిసింది. దీంతో మంటలు కూడ ఆరిపోయాయి. అయితే టపాకాయలు పేల్చడంతో వెలువడిన నిప్పు రవ్వల కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని అనుమానిస్తున్నారు.ఇవాళ ఉదయం లాల్ బౌగ్చా సహా ముంబైలోని ప్రసిద్ద వినాయక మండపాలను జేపీ నడ్డా సందర్శించుకున్నారు.