దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని మోతీ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఫ్యాక్టరీలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించించింది. 

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని మోతీ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఫ్యాక్టరీలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించించింది. రాత్రి 11.40 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. దీంతో అగ్నిమాపక యంత్రాలు ఘటన స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. 27 అగ్నిమాపక యంత్రాల సాయంతో సంఘటనా స్థలంలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినట్టుగా తెలిపారు. 

అయితే మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం గానీ, ఎవరికి గాయాలు అయినట్లు సమాచారం లేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. అయితే మంటల చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.