మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాల్గర్‌ జిల్లాలోని వాంఘోస్‌లో గురువారం బాణాసంచి తయారీ కేంద్రంలో పేలుళ్లు సంభవించాయి. భారీ పేలుళ్ల ధాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాల్గర్‌ జిల్లాలోని వాంఘోస్‌లో గురువారం బాణాసంచి తయారీ కేంద్రంలో పేలుళ్లు సంభవించాయి. భారీ పేలుళ్ల ధాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వెంటనే అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఫ్యాక్ట‌రీలో పలువురు కార్మికులు ఉన్న‌ట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.