Asianet News TeluguAsianet News Telugu

కేరళలో అర్దరాత్రి రైలు బోగీలో చెలరేగిన మంటలు.. సీసీటీవీ ఫుటేజ్‌లో ఏం తేలింది..? (వీడియో)

కేరళలో ఓ రైలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం తెల్లవారుజామున కన్నూర్ రైల్వే స్టేషన్‌లో మంటలు చెలరేగాయి.

Fire breaks out at Alappuzha-Kannur Express train coach halted at Kannur railway station ksm
Author
First Published Jun 1, 2023, 9:49 AM IST

కేరళలో ఓ రైలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం తెల్లవారుజామున కన్నూర్ రైల్వే స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. రైల్వే స్టేషన్‌లో రైలు ఆగి ఉండగా ఈ ఘటన జరిగింది. మంటల్లో రైలులోని ఒక కోచ్ దగ్ధమైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక కోచ్‌లో మంటలు చెలరేగడంతో రైలులోని ఇతర కోచ్‌లను దాని  నుంచి విడదీశారు. 

తెల్లవారుజామున 1.45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే గుర్తు తెలియని వ్యక్తి కోచ్ వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో బయటపడ్డాయి. దీంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. అయితే గుర్తుతెలియని పెట్రోల్ లాంటి ఇంధనం పోసి నిప్పంటించినట్లుగా అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అంతకుముందు ఈ ఏడాది ఏప్రిల్ 2న కోజికోడ్ జిల్లాలో ఎలత్తూర్ సమీపంలో ఇదే రైలులో  షారూఖ్‌ సైఫీ అనే వ్యక్తి  తోటి ప్రయాణికులు నిప్పుపెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక శిశువుతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి. భారతీయ శిక్షాస్మృతి, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, రైల్వే చట్టం, పేలుడు పదార్థాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios