న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. మంటలను ఆరు ఫైరింజన్లను ఆర్పుతున్నాయి. ఎయిమ్స్ లోని ఎమర్జెన్సీ విభాగంలో మంటలు  వ్యాపించాయి.

ఎయిమ్స్ లోని రెండో ఫ్లోర్ లో శనివారం నాడు మంటలు వ్యాపించాయి.  ఎయిమ్స్ లో  అగ్ని ప్రమాదం ఎలా వ్యాపించిందనే విషయమై అధికారులు గుర్తించే ప్రయత్నిస్తున్నారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకొందని  అధికారులు చెబుతున్నారు. ఎమర్జెన్సీ వార్డుల్లో ఉన్న రోగులను మరో బ్లాకుల్లోకి తరలించారు. అగ్ని ప్రమాదం కారణంగా ఎయిమ్స్ లో పోగలు వ్యాపించాయి.

40 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. ఈ ప్రాంతంలోకి ఎవరినీ కూడ అనుమతించడం లేదు. ప్రమాదం చోటు చేసుకొన్న బ్లాక్ కు పక్కనే బ్లాక్ లోనే మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్నారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితి కూడ విషమంగా ఉంది.