న్యూఢిల్లీలోని జామియానగర్ లో బుధవారం నాడు ఎలక్ట్రిక్ మోటార్ పార్కింగ్ లో బుధవారం నాడు అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో డజన్లకొద్ది వాహనాలు దగ్దమయ్యాయి.

న్యూఢిల్లీ: New Delhi లోని Jamianagarనగర్‌లోని Electric Motor Parking లో బుధవారం నడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.మంటలను ఆర్పేందుకు మొత్తం ఏడు ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. మొత్తం 10 కార్లు, ఒక మోటార్ సైకిల్, 30 కొత్త ఈ రిక్షాలు, 50 పాత ఈ రిక్షాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలు అదుపులోకి వచ్చినట్టుగా అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 

also read;fire accident : ఢిల్లీలో మళ్లీ అగ్నిప్రమాదం. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆఫీసులో చెలరేగిన మంటలు

న్యూఢిల్లీలోని వేడిగాలుల మధ్య వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. గత నెల ప్రారంభంలో ఔటర్ ఢిల్లీలోని ముండ్కాలో నాలుగంతస్థుల వాణిజ్య భవనంలో భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 27 మంది మరణించారు. మరోొ 12 మంది గాయపడిన విషయం తెలిసిందే.

ఢిల్లీలోని నరేలాలోని ప్లాస్టిక్ గ్రాన్యులేషన్ ఫ్యాక్టరీలో మే 15న అగ్నిప్రమాదం సంభవించింది. 22 ఫైర్ ఇంజ‌న్లు మంటలను ఆర్పాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం. ఈ ఫ్యాక్ట‌రీలో చెలరేగిన మంట‌ల్లో ఎవ‌రూ చిక్కుకోలేదు. నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో రాత్రి 9.10 గంటలకు అగ్నిప్రమాదం ప్ర‌మాదం సంభ‌వించింద‌ని తమకు కాల్ వచ్చిందని అగ్నిమాపక శాఖ ఎస్కే దువా తెలిపారు.

 ఇది మీడియం కేటగిరీ అగ్నిప్రమాదంగా అధికారులు ప్రకటించారు. ఘటనా స్థలంలో 22 అగ్నిమాపక ఇంజన్లు ఉన్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ముండ్కాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 27 మంది మరణించిన ఒక రోజు తరువాత ఇది జరిగింది. ఆ ప్ర‌మాదంలో 30 మంది ఆచూకీ ఇంకా ల‌భించ‌లేదు.
ముండ్కా ప్ర‌మాదంలో 50 మందిని అగ్నిమాప‌క సిబ్బంది ర‌క్షించారు. తీవ్ర ప్రాణ‌న‌ష్టాన్ని క‌లిగించిన ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు చెప్పారు. ముండ్కా అగ్నిప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

పంజాబ్‌లోని ఆధ్యాత్మిక పట్టణం అమృత్‌సర్‌లో మే చివర్లో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గురునానక్ దేవ్ ఆసుపత్రిలో ప‌గ‌టిపూట ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఓపీడీ సమీపంలో పెద్ద పేలుడు సంభవించడంతో సమీపంలోని భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే అది స్కిన్ , కార్డియాలజీ వార్డుకు కూడా వ్యాపించింది. వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

పశ్చిమ ఢిల్లీలోని ముండ్కాలోని నాలుగు అంతస్తుల వాణిజ్య భవనంలో మే 14న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో కనీసం 27 మంది మరణించగా, 12 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదం తరువాత ఆ భవనం నుండి కనీసం 60 మందిని రక్షించారు.మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఢిల్లీ ఫైర్ సర్వీస్ క్రేన్లను మోహరించింది. అయితే, మంటల వల్ల భవనం మొత్తం పొగలు వ్యాపించాయి. దీంతో కొంతమంది తమను తాము రక్షించుకోవడానికి కిటికీల నుండి దూకేశారు. మరికొందరు క్రిందికి దిగడానికి తాళ్లను ఉపయోగించారు.సీసీటీవీ కెమెరాలు, రూటర్ల తయారీ కంపెనీ కార్యాలయం ఉన్న భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అవుటర్) సమీర్ శర్మ తెలిపారు.