దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో బుధవారం నాడు రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఎయిమ్స్ తొమ్మిదో అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఈ ఫ్లోర్‌లో రోగులు ఎవరూ కూడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొన్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో బుధవారం నాడు రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఎయిమ్స్ తొమ్మిదో అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఈ ఫ్లోర్‌లో రోగులు ఎవరూ కూడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొన్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
ఎయిమ్స్ లో మంటలను ఆర్పేందుకు 22 ఫైరింజన్లు రంగంలోకి దింపారు అధికారులు. ఎయిమ్స్ కన్వర్జెన్స్ బ్లాక్ లో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రకటించారు. ఈ బ్లాక్ లో ఫ్రిడ్జ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. 22 ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. దేశంలోని పలు ఆసుపత్రుల్లో ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఢిల్లీలోని మార్కెట్ యార్డులతో పాటు ఆసుపత్రుల్లో కూడ తరుచుగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకొన్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా ఉన్నాయి.
