న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని  ఓ ఫ్యాక్టరీలో గురువారం నాడు  ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.అగ్ని ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీ భవనం కుప్పకూలింది.

న్యూఢిల్లీలోని పీరాగర్లీలోని ఓ ఫ్యాక్టరీలో గురువారం నాడు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ అగ్ని ప్రమాదం  విషయం తెలిసిన వెంటనే  ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్న సమయంలోనే భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది కూడ శిథిలాల కింద చిక్కుకున్నారు.  శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్‌డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. 

ఈ ఫ్యాక్టరీలో బ్యాటరీలు లీకైన కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 

అప్పటికే భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలను 36 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.ఈ తరుణంలో ఈ భవనం కుప్పకూలింది. గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన జరిగిన ఓ ఘోర అగ్ని ప్రమాదంలో 43 మంది మృతి చెందారు. ఆ తర్వాత కూడ మరో ప్రాంతంలో కూడ అగ్ని ప్రమాదం  చోటు చేసుకొంది.ఈ రెండు ఘటనల తర్వాత  చోటు చేసుకొన్న అగ్నిప్రమాదం గా అధికారులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమీక్షిస్తున్నారు.