Asianet News TeluguAsianet News Telugu

న్యూఢిల్లీ - దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. స్టేషన్ మాస్టర్ గమనించకుంటే..?

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం తృటిలో మిస్ అయ్యింది. న్యూఢిల్లీ - దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి మూడు భోగీలు దగ్ధం అయ్యాయి. సరాయ్ భూపత్ స్టేషన్ దాటుతుండగా స్లీపర్ కోచ్‌ నుంచి పొగలు వచ్చాయి.

Fire accident in New Delhi-Darbhanga Superfast Express ksp
Author
First Published Nov 15, 2023, 8:04 PM IST | Last Updated Nov 15, 2023, 8:04 PM IST

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం తృటిలో మిస్ అయ్యింది. న్యూఢిల్లీ - దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి మూడు భోగీలు దగ్ధం అయ్యాయి. యూపీలోని ఇట్టావా స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సరాయ్ భూపత్ స్టేషన్ దాటుతుండగా స్లీపర్ కోచ్‌ నుంచి పొగలు వచ్చాయి. దీనిని గమనించిన స్టేషన్ మాస్టర్ వెంటన్ లోకో పైలట్, గార్డ్‌కు సమాచారం అందించారు. వెంటనే ట్రైన్‌ని నిలిపివేయగా.. ప్రయాణీకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక, రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో మూడు బోగీలు దగ్థమైనట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios