ఏఎంఆర్‌ఐ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 92 మంది చనిపోయారు. రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో చాలా మంది రోగులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.
కోల్‌కతా మెడికల్ కాలేజీలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఆస్పత్రిలోని 250 మంది రోగులను, సెలైన్ బాటల్స్, స్ట్రెక్చర్‌లతో సహా హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో కొందరిని ఇతర ఆస్పత్రులకు పంపించారు. తొలుత ఉదయం 7.30 ప్రాంతంలో దట్టమైన పొగ రావడం గమనించిన సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పది అగ్ని మాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఆస్పత్రిలోని ఫార్మసీ విభాగంలో తొలుత మంటలు చెలరేగాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంగళవారం నగరంలోని నగర్‌బజార్ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక బాలుడు చనిపోగా.. తొమ్మిది మంది గాయపడ్డారు.
2011లో కోల్‌కతాలోని ఏఎంఆర్‌ఐ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 92 మంది చనిపోయారు. రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో చాలా మంది రోగులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.
