దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కరోల్‌బాగ్‌లోని అర్పిత్ ప్యాలెస్‌ అనే హోటల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున ఏం జరుగుతుందో తెలిసేలోపు, అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాద పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. పలువురుమంటల్లో చిక్కుకున్నట్లుగా భావిస్తున్నారు.

హోటల్ సిబ్బంది సుమారు పాతిక మందిని రక్షించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సుమారు 26 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.