రాంపూర్: బిజెపి నేత, సినీ నటి జయప్రదపై అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేసిన సమాజ్ వాదీ పార్టీ లోకసభ సభ్యుడు ఆజం ఖాన్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. సోమవారంనాడు ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనతో పాటు మరో పది మంది పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 

లోకసభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జూన్ 30వ తేదీన తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన సమయంలో జయప్రదపైల ఆజంఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆమెపై అసభ్య పదజాలాన్ని వాడారు. 

జయప్రదపై అసభ్య పదజాలం వాడినందుకు ఆజం ఖాన్ ను ఎన్నికల కమిషన్ 72 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. జయప్రదను తాను రాంపూర్ కు తెచ్చానని, ఆమె శరీరాన్ని ఎవరూ స్పర్శించకుండా చూసుకున్నానని, ఆమె అసలు స్వరూపం తెలుసుకోవడానికి తనకు 17 ఏళ్లు పట్టిందని, కానీ 17 రోజుల్లోనే ఖాకీ.... ధరించిందని తెలిసి వచ్చిందని అన్నారు. 

అజంఖాన్ రాంపూర్ లోకసభ స్థానం నుంచి జయప్రదపై పోటీ చేసి విజయం సాధించారు.