పీఎం కేర్స్ ఫండ్‌పై విమర్శలు: సోనియాగాంధీపై ఎఫ్ఐఆర్

కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది.  పీఎం కేర్స్ ఫండ్ గురించి ప్రజలకు తప్పుడు అభిప్రాయం కలిగేలా ట్వీట్ చేసినందుకు గాను కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో ఎఫ్ఐఆర్ నమోదైంది.

FIR filed against Sonia Gandhi over remarks on PMCARES Fund

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది.  పీఎం కేర్స్ ఫండ్ గురించి ప్రజలకు తప్పుడు అభిప్రాయం కలిగేలా ట్వీట్ చేసినందుకు గాను కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో ఎఫ్ఐఆర్ నమోదైంది.

మే 11వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఈ ట్వీట్ ను షేర్ చేసింది. పీఎం కేర్స్ నిధులు దుర్వినియోగం అయ్యాయని తప్పుడు ప్రచారం చేశారని కేవీ ప్రవీణ్ అనే వ్యక్తి చెప్పాడు. 

పీఎం కేర్స్ ఫండ్ పీఎం కేర్స్ ఫ్రాడ్ గా మారింది కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ నుండి ట్వీట్ చేశారని ఆయన చెప్పారు. ఈ ట్వీట్ సమాచారాన్ని సేకరించి ఫిర్యాదు చేసినట్టుగా ఆయన తెలిపారు.

also read:ఇండియాలో 5 కోట్ల మందికి హ్యాండ్ వాష్ అందుబాటులో లేదు: రిపోర్ట్

ఈ విషయమై ప్రాథమిక విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా చెప్పారు.  ఈ నిధులతో ప్రధాని విదేశీ ప్రయాణాలకు తిరిగి ఎంజాయి చేశారని కూడ ఈ ట్వీట్ లో పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. శివమొగ్గలోని సాగర్ పోలీసులు సోనియాగాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆయన చెప్పారు.

కరోనా నేపథ్యంలో  విరాళాలను పీఎం కేర్స్ కు పంపాలని ప్రధాని మోడీ కోరారు. దేశంలో పలువురు పీఎం కేర్స్ కు విరాళాలను పంపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios