Asianet News TeluguAsianet News Telugu

పావురంపై ఎఫ్ఐఆర్.. తెల్లకాగితం మోసుకొచ్చిందని కేసు పెట్టిన పోలీసులు...

పంజాబ్ లో ఓ పావురంపై కేసు నమోదయ్యింది. కాలికి తెల్లకాగితం కట్టుకుని వచ్చిన ఆ పావురాన్ని పట్టుకుని పోలీసులు దాన్ని బోనులో బంధించారు. ఇంతకీ ఆ పావురం చేసిన తప్పేంటంటే..

FIR against pigeon for carrying suspicious paper near Indo-Pak border  - bsb
Author
Hyderabad, First Published Apr 21, 2021, 1:33 PM IST

పంజాబ్ లో ఓ పావురంపై కేసు నమోదయ్యింది. కాలికి తెల్లకాగితం కట్టుకుని వచ్చిన ఆ పావురాన్ని పట్టుకుని పోలీసులు దాన్ని బోనులో బంధించారు. ఇంతకీ ఆ పావురం చేసిన తప్పేంటంటే..

పంజాబ్లోని పాకిస్థాన్ సరిహద్దుల్లో ఓ అనుమానాస్పద పావురం పై కేసు నమోదైంది. పావురం కాళ్లకు ఓ కాగితం ఉంది. పాకిస్తాన్ సరిహద్దులకు కేవలం 500 మీటర్ల దూరంలోని గస్తీ స్థావరం రోరన్ వాలాకు ఈ పావురం ఏప్రిల్ 17 సాయంత్రం వచ్చింది. క్యాంపు గార్డ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నీరజ్ కుమార్ భుజం పై వాలింది.

నీరజ్ కుమార్ వెంటనే ఈ విషయాన్ని స్థావరం కమాండర్ ఓం పాల్ సింగ్ తెలిపారు. ఆ పావురాన్ని ఓంపాల్ సింగ్ పరీక్షించారు. దాని కాలికి ఓ తెల్ల కాగితం అంటించి ఉన్నట్లు, దానిపై ఓ నెంబర్ రాసి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ పావురం పై అమృత్సర్లోని కహా గాడ్ పోలీస్స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పాకిస్తాన్ లో పావురాలకు గూఢచర్యంలో శిక్షణ ఇచ్చి మన దేశంలోకి పంపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు మే నెలలో జమ్మూకాశ్మీర్లోని కథువా జిల్లాకు ఇటువంటి పావురమే వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios