బలవంతంగా దించినందుకు 35లక్షలు జరిమానా

First Published 1, Sep 2018, 11:15 AM IST
Fine to two airlines for not allowing to board
Highlights

రెండు విమానయాన సంస్థలకు పంజాబ్ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ భారీ జరిమానా  విధించింది. ఓ మహిళను తన ఇద్దరు పిల్లలతో సహా విమానం నుంచి బలవంతంగా దింపినందుకు రెండు విమానయాన సంస్థలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. 35 లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా పంజాబ్‌ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ జెట్‌ ఎయిర్‌వేస్, ఎయిర్‌ కెనడా సంస్థలను ఆదేశించింది. 
 

చండీగఢ్‌: రెండు విమానయాన సంస్థలకు పంజాబ్ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ భారీ జరిమానా  విధించింది. ఓ మహిళను తన ఇద్దరు పిల్లలతో సహా విమానం నుంచి బలవంతంగా దింపినందుకు రెండు విమానయాన సంస్థలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. 35 లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా పంజాబ్‌ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ జెట్‌ ఎయిర్‌వేస్, ఎయిర్‌ కెనడా సంస్థలను ఆదేశించింది. 

గత ఏడాది నవంబర్‌లో మినాలీ మిట్టల్‌ అనే మహిళ తన 11 ఏళ్ల కూతురు, మూడేళ్ల కొడుకుతో కలసి కెనడాలోని టొరంటోకు బయల్దేరింది. తొలుత ఢిల్లీ వెళ్లేందుకు మొహాలీలోని చండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానమెక్కారు. తర్వాత ఢిల్లీలో ఎయిర్‌ కెనడా విమానమెక్కారు. ఆ సమయంలో మినాలీ కూతురు తీషా తాళంవేసి ఉన్న వాష్‌రూం వద్ద వాంతి చేసుకుంది. 

తోటి ప్రయాణికులకు ఇబ్బంది అంటూ కేకలువేస్తూ మినాలీ, ఆమె కుమార్తె, కొడుకును విమానం నుంచి బలవంతంగా విమాన సిబ్బంది దింపేశారు. అయితే వారి లగేజీని మాత్రం ఢిల్లీ విమానాశ్రయంలో దించకుండా టోరంటోకు తీసుకెళ్లి అక్కడ దించారు. దీంతో బాధితురాలు పంజాబ్ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ కు ఫిర్యాదు చెయ్యగా 35 లక్షల రూపాయలు భారీ జరిమానా విధించింది.

loader