చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని ఓ పోలీసు స్టేషన్ లో వింత కేసు నమోదు అయ్యింది. తన చిలుక ఎగిరిపోయిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దానిని వెతికి పట్టుకునేందుకు సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. 

అల్లారు ముద్దుగా పెంచుకున్న త‌న చిలుక ఎగిరిపోయింద‌ని, దానిని వెతికిప‌ట్టుకోవాల‌ని ఓ వ్య‌క్తి పోలీసు స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. చ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రంలోని ఓ పోలీసు స్టేష‌న్ లో ఈ విచిత్ర కేసు న‌మోదైంది. దీంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి చిలుక‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 

Rahul Gandhi: "ప్రధానమంత్రి గారూ.. భద్రత క‌ల్పించండి": రాహుల్ గాంధీ

చ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రం బస్త‌ర్ జిల్లా గ‌జ‌ద‌ల్ పుర్ రాష్ట్రానికి చెందిన మ‌నీష్ ఠ‌క్క‌ర్ ఏడేళ్లుగా త‌న ఇంట్లో చిలుక‌ను పెంచుకుంటున్నాడు. దానికి అన్ని స‌ప‌ర్యలు చేస్తూ, సొంత కుటుంబ స‌భ్యురాలిలా చూసుకుంటున్నాడు. అయితే ఎప్పుటిలాగే గ‌త‌ గురువారం పంజ‌రాన్ని తెరిచాడు. అయితే దానికి ఆ ఇంట్లో ఉండి బోర్ కొట్టిందో ఏమో గానీ పంజ‌రం తెర‌వ‌గానే బ‌య‌టకు ఎగిరిపోయింది. అది మ‌ళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. 

కుర్చీలు విర‌గ్గొడుతూ, కేకలేస్తూ బీజేపీ నాయకుల ఆగ్రహం.. త్రిపుర సీఎం ప్ర‌క‌ట‌న స‌మ‌యంలో గంద‌ర‌గోళం..

చాలా సేపు ఎదురు చూసిన మ‌నీష్ ఠ‌క్క‌ర్ తీవ్రంగా బాధ‌ప‌డ్డాడు. ఇక అది ఇంటికి రాద‌ని నిర్ధారించుకొని పోలీసు స్టేష‌న్ కు వెళ్లాడు. పోలీసుల ఎదుట త‌న ఆవేద‌నను వ్య‌క్తం చేశారు. త‌న చిలుక ఎగిరిపోయింద‌ని, దానిని ఎలాగైనా ప‌ట్టుకోవాల‌ని వేడుకున్నాడు. ఈ మేర‌కు ఫిర్యాదు చేశారు. అత‌డి ఆవేద‌న‌ను విన్న పోలీసులు మిస్సింగ్ కేసు న‌మోదు చేసుకున్నారు. దానిని ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దాని కోసం సీసీటీవీ ఫుటేజ్ ల‌ను ప‌రిశీలిస్తున్నారు.

ఆరేళ్ల బాలిక‌ను చిదిమేసిన ట్ర‌క్కు.. ఆగ్ర‌హంతో వాహ‌నానికి నిప్పుపెట్టి, డ్రైవర్‌ను మంటల్లోకి తోసేసిన జనం

కొంత కాలం కింద‌ట బీహార్ లోనూ ఇలాంటి ప‌రిణామం చోటు చేసుకుంది. అక్క‌డ ఓ కుటుంబం చిలుక‌ను తెచ్చుకొని ప్రేమగా పెంచుకుంది. అయితే ఆ చిలుక ఎగిరిపోయింది. దీంతో ఆ కుటుంబం తీవ్రంగా క‌ల‌త చెందింది. దానిని వెతికే ప‌నిలో ప‌డింది. వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌క‌పోయినా.. దాని జాడ‌ను తెలుసుకునేందుకు ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ చిలుక ఫొటోలు తీసి, పోస్ట‌ర్లు రెడీ చేయించారు. ఊరూరా వాటిని అతికించారు. త‌మ చిలుక త‌ప్పిపోయింద‌ని, కనిపించిన వారు తెచ్చివ్వాల‌ని ఆ పోస్ట‌ర్ల‌లో పేర్కొన్నారు. ఆ చిలుక‌ను తీసుకొచ్చిన వారికి రూ. 5,500 బ‌హుమ‌తిగా ఇస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు.