Asianet News TeluguAsianet News Telugu

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల న‌ల్ల‌ధ‌నం.. ఆ లెక్కలన్నీ అవాస్తవం: కేంద్ర ఆర్థిక‌ శాఖ ప్రకటన

స్విస్ బ్యాంకుల్లో భార‌తీయులు దాచిన న‌ల్ల‌ధ‌నం గ‌త ఏడాది సుమారు 20 వేల కోట్లకు పెరిగిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ ఖండించింది. స్విస్ నేష‌న‌ల్ బ్యాంక్‌కు వివిధ స్విస్ బ్యాంకులు స‌మ‌ర్పించిన మొత్తం ఫిగ‌ర్‌ను త‌ప్పుగా చిత్రీక‌రించిన‌ట్లు ఆర్థిక శాఖ తెలిపింది

Finance Ministry Responds To Whopping Rs 20700 Cr Rise Of Indian Funds In Swiss Banks ksp
Author
New Delhi, First Published Jun 19, 2021, 10:33 PM IST

స్విస్ బ్యాంకుల్లో భార‌తీయులు దాచిన న‌ల్ల‌ధ‌నం గ‌త ఏడాది సుమారు 20 వేల కోట్లకు పెరిగిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ ఖండించింది. స్విస్ నేష‌న‌ల్ బ్యాంక్‌కు వివిధ స్విస్ బ్యాంకులు స‌మ‌ర్పించిన మొత్తం ఫిగ‌ర్‌ను త‌ప్పుగా చిత్రీక‌రించిన‌ట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అది కేవ‌లం స్విట్జ‌ర్లాండ్‌లో దాచుకున్న భార‌తీయుల సొమ్ము కాదు అని పేర్కొంది. 2019 నుంచి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు త‌గ్గిన‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. అయితే స్విస్ బ్యాంకుల నుంచి భార‌తీయల వివ‌రాల‌ను సేక‌రిస్తున్న‌ట్లు పేర్కొంది. డిపాజిట్లు స‌గం త‌గ్గిన‌ట్లు చెప్పిన విత్త మంత్రిత్వ ఆ మొత్తం ఎంత అన్న విష‌యాన్ని వెల్లడించలేదు. 

కాగా, పెద్ద నోట్ల రద్దు వంటి భారీ సంస్కరణలు చేపట్టినా, కఠిన చర్యలు, కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా వున్నప్పటికీ స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద భారీగా పెరిగినట్లు నిన్న మీడియాలో కథనాలు వచ్చాచి. వాటి ప్రకారం ఈ మొత్తం రూ. 20,700 కోట్లకు చేరుకుందట. గతేడాది చివరి నాటికి వెలుగులోకి వచ్చిన లెక్కలివి. రెండేళ్ల పాటు క్షీణించినప్పటికీ గతేడాది మాత్రం ఈ సంపద పెరిగిపోయింది. ఈ క్రమంలో... స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 13 సంవత్సరాల గరిష్టానికి చేరుకుంది.

Also Read:పెద్దనోట్ల రద్దు, కఠిన నిఘా వృథాయేనా: స్విస్ బ్యాంకుల్లో భారీగా పెరిగిన భారతీయుల సంపద

2019 చివరినాటికి భారతీయులు, భారతీయ కంపెనీలు దాచుకున్న సొమ్ము విలువ దాదాపు రూ. 6,625 కోట్లుగా తేలింది. బాండ్స్, ఇతర పథకాల్లో డిపాజిట్ చేసిన మొత్తం భారీగా పెరగడమే ఇందుకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ఖాతాదారుల డిపాజిట్లు 2020 లో క్షీణించినట్లు స్విట్జర్లాంట్ సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. అన్ని స్విస్ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020 సంవత్సరంలో దాదాపు రెండు ల‌క్ష‌ల కోట్ల స్విస్ ఫ్రాంక్స్‌కు చేరుకున్నాయి.

ఇందులో విదేశీ ఖాతాదారుల డిపాజిట్లు 600 బిలియన్ డాలర్లు. 377 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లతో బ్రిటన్ అగ్రస్థానంలో, 152 బిలియన్ డాలర్లతో అమెరికా రెండో స్థానంలో నిలిచాయి. వంద బిలియన్ ఫ్రాంక్స్‌‌లకు పైగా ఉన్న దేశాలు ఈ రెండు మాత్రమే.  2006లో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారత కంపెనీల నిధులు 6.5 బిలియన్ డాలర్లు కాగా, 2011, 2013, 2017 సహా మరికొన్ని సంవత్సరాలను మినహాయిస్తే మిగిలిన సంవత్సరాల్లో ఈ మొత్తం తగ్గింది. గతేడాది కస్టమర్ అకౌంట్ డిపాజిట్ 503.9 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ ( భారత కరెన్సీలో రూ. 4 వేల కోట్లు). 2019లో ఈ మొత్తం 550 మిలియన్ ఫ్రాంక్‌లు. 

Follow Us:
Download App:
  • android
  • ios