Asianet News TeluguAsianet News Telugu

డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి

డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేసే ఉద్దేశం లేదని, ఇది సరైన సమయం కాదని కేంద్ర  ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించింది.  

Finance Minister says Not The Right Time To Make Digital Payments Chargeable
Author
First Published Aug 27, 2022, 1:44 AM IST

ప్ర‌స్తుతానికి డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేసే ఉద్దేశం లేదని, ఇది సరైన సమయం కాదని కేంద్ర  ఆర్థికశాఖ వెల్లడించింది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ విష‌యంపై అధ్యయనం చేస్తోందంటూ తెలిపింది. డిజిటల్ చెల్లింపును ప్రజా ప్రయోజనంగా చూస్తున్నాము. ప్రజలు దానిని స్వేచ్ఛగా యాక్సెస్ చేయగలగాలి, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ యొక్క డిజిటలైజేషన్ ఆకర్షణీయంగా మారుతుంది. అలాగే డిజిటలైజేషన్ ద్వారా.. పారదర్శక చెల్లింపులు జ‌రుగుతాయి. కాబట్టి అవసరం. అందవ‌ల్ల‌.. డిజిట‌ల్ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయడానికి ఇది సరైన సమయం కాదని.  కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఇదే భావిస్తున్న‌ట్టు తెలిపారు.

ఓపెన్ డిజిటల్ లావాదేవీలు, డిజిటలైజేషన్, యాక్సెస్‌ను ప్రారంభించగల ప్లాట్‌ఫారమ్‌ల వైపు మరింతగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. పేపర్ లెస్ ట్రాన్స్ జ‌క్ష‌న్స్ ప్రోత్సహించ‌నున్న‌ట్టు తెలిపారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా చేసే లావాదేవీలపై టైర్డ్ ఛార్జీలు విధించే అవకాశంతో సహా చెల్లింపుల వ్యవస్థలో ప్రతిపాదించిన వివిధ మార్పులపై ప్రజల నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అభిప్రాయాన్ని కోరుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు. అయితే.. UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సేవలపై ఎటువంటి ఛార్జీలు విధించబోమని భారత ప్రభుత్వం గత వారం ప్రకటించింది.

రోజురోజుకు పెరుగుతోన్న లావాదేవీలు 

యూపీఐ చెల్లింపుల ద్వారా ప్రస్తుతం రోజుకు 21 కోట్లకు పైగా చెల్లింపులు జరుగుతున్నట్లు ఎన్‌పీసీఐ  అంచనా వేసింది. ఎన్‌పీసీఐ జులై గణాంకాల ప్ర‌కారం.. దేశ‌వ్యాప్తంగా మొత్తం 338 బ్యాంకులు యూపీఐ లావాదేవీల్లో పాలు పంచుకున్న‌ట్టు నివేదిక వెల్ల‌డించింది.  628.8 కోట్ల లావాదేవీలు జరగగా.. వీటి విలువ రూ.10,62,991.76 కోట్లుగా వెల్లడైంది.  అదే గ‌తేడాది జులైలో లావాదేవీల సంఖ్య 324 కోట్లు కాగా, విలువ రూ.6,06,281.14 కోట్లు కాగా.. కేవ‌లం ఒక‌ ఏడాది వ్యవధిలో లావాదేవీల సంఖ్య రెట్టింపు అయ్యింది. డిజిటల్ చెల్లింపుల వైపు అడుగులేస్తున్న భార‌త్ లో 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో దాదాపు 4600 కోట్ల లావాదేవీలు జరిగాగ.. వీటి యొక్క మొత్తం విలువ దాదాపు రూ.84.17లక్షల కోట్ల వరకూ ఉందని ఎన్‌పీసీఐ గణాంకాలు వెల్ల‌డించాయి. అలాగే.. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో 2228 కోట్ల సార్లు లావాదేవీలు జరగగా వీటి విలువ దాదాపు రూ.41.03 లక్షల కోట్లుగా ఉంది.

యూపీఐ ప్రధాన లక్ష్యం నగదు రహిత భార‌త ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడమే.. ఆ దిశ‌గానే భార‌త్ అడుగులు వేస్తుంది. ప్ర‌తి చిన్న చెల్లింపులైనా యూపీఐ ద్వారా చేస్తుంది. ఇందులో ఆస‌క్తిక‌ర విష‌య‌మేమిటంటే.. యూపీఐ లావాదేవీల్లో 50 శాతం కంటే ఎక్కువ చెల్లింపులు రూ.200లోపువే.. టీ తాగినా, టిఫిన్ చేసిన ఏ చిన్న చెల్లింపుల‌కైనా యూపీఐ ఆధారిత డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో యూపీఐ సేవలపై వ‌సూలు లేదా  జీఎస్‌టీ విధిస్తే.. వినియోగదారులు మళ్లీ నగదు చెల్లింపుల వైపు మొగ్గు చూపుతారని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. దీంతో కొద్దిరోజులకే యూపీఐపై ఎలాంటి ఛార్జీలూ వసూలు చేసే ప్ర‌స‌క్తే  లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios