లక్నో:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగులు ప్రయాణీకులతో వెళ్తున్న బస్సును బుధవారం నాడు హైజాక్ చేశారు. 

ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలోని న్యూ సదరన్ బైపాస్ కు చెందిన ఫైనాన్స్ సంస్థలోని కొంతమంది ఉద్యోగులు బస్సును హైజాక్ చేశారు. ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు బస్సు డ్రైవర్, సహాయకుడిని బలవంతంగా బస్సు నుండి దింపి ఆ బస్సును హైజాక్ చేశారు. ఈ సమయంలో బస్సులో 34 మంది ప్రయాణీకులు ఉన్నారు.

ఆగ్రాలోని ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగులు స్వాధీనం చేసుకొన్న బస్సును గురుగ్రామ్ నుండి మధ్యప్రదేశ్ గ్వాలియర్ వైపు తీసుకెళ్లారు.

ఫైనాన్స్ కంపెనీ అక్రమంగా బస్సును స్వాధీనం చేసుకొన్నట్టుగా యూపీ ప్రభుత్వం ప్రకటించింది. డ్రైవర్ సహా సిబ్బంది, ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నట్టుగా యూపీ ప్రభుత్వం ప్రకటించింది. బస్సు యజమాని ఈ నెల 18వ తేదీన మరణించాడు. ఆయన తనయుడు ఇవాళ చివరి కర్మలు నిర్వహిస్తున్నట్టుగా యూపీ సర్కార్ తెలిపింది.

శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఉద్యోగులు ఈ బస్సును హైజాక్ చేసినట్టుగా  ఆగ్రా ఎస్ఎస్‌పీ బబ్లూ కుమార్ చెప్పారు. గ్వాలియర్ నుండి ముగ్గురు వ్యక్తులు ఇవాళ బస్సులో ప్రయాణీస్తూ హైజాక్ కు పాల్పడినట్టుగా ఆయన చెప్పారు. ఒక ఫైనాన్స్ కంపెనీ సభ్యులు ఈ బస్సును హైజాక్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. 

బస్సుకు ఫైనాన్స్ చేసిన కంపెనీ ఈ బస్సును హైజాక్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు.