Asianet News TeluguAsianet News Telugu

గుడ్‌న్యూస్: ఇంటి నుండే ఫైనలియర్ పరీక్షలకు అనుమతి

డిగ్రీ, పీజీ విద్యార్థులకు  మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటి నుండే ఫైనల్ ఇయర్  పరీక్షలను ఇంటి నుండే రాసుకొనే అవకాశాన్ని కల్పించింది. అయితే జవాబు పత్రాలను సంబంధిత కేంద్రాల్లో ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది.

Final year college students in Madhya Pradesh to appear for exams from home
Author
Bhopal, First Published Jul 30, 2020, 12:29 PM IST


భోపాల్: డిగ్రీ, పీజీ విద్యార్థులకు  మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటి నుండే ఫైనల్ ఇయర్  పరీక్షలను ఇంటి నుండే రాసుకొనే అవకాశాన్ని కల్పించింది. అయితే జవాబు పత్రాలను సంబంధిత కేంద్రాల్లో ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది.

గ్రాడ్యుయేషన్, పీజీ విద్యార్థులు 4వ సెమిష్టర్ పరీక్షలను ఇంటి నుండే రాసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించింది.

కరోనా నేపథ్యంలో విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులు తమ పరీక్షలను ఇంటి నుండి ఆఫ్ లైన్ మోడ్ లో రాయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టెక్నికల్ కోర్సుల్లో చేరిన విద్యార్ధులు ఆన్ లైన్ మోడ్ లో పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కరోనాను దృష్టిలో ఉంచుకొని ఫస్టియర్, సెకండియర్ కాలేజీ విద్యార్థులను పాస్ చేసింది. పరీక్షలు నిర్వహించకుండానే వారిని ఎగువ తరగతులకు ప్రమోట్ చేసింది.

పరీక్షలు లేకుండా ప్రమోటైన విద్యార్థులకు గత సెమిస్టర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా మార్కులను కేటాయించనున్నారు. కాలేజీలు తీరిగి  ఓపెన్ చేసిన తర్వాత ఇంప్రూవ్ మెంట్ కోసం పరీక్షలు నిర్వహించనున్నట్టుగా  ప్రభుత్వం ప్రకటించింది.ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరువరకు టెర్మినల్ సెమిస్టర్  చివరి సంవత్సరం పరీక్షలను నిర్వహించాలని యూజీసీ ఆదేశించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios