అరెస్టయిన ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్‌తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసినందుకు, ఈ రకంగా అమిష్ షా ప్రతిష్టను దెబ్బతీయడమే ఉద్దేశ్యమని పేర్కొంటూ చిత్ర నిర్మాత అవినాష్ దాస్‌పై అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అహ్మదాబాద్ : కేంద్ర హోంమంత్రి Amit Shah అరెస్టయిన ఐఏఎస్ అధికారిణి Pooja Singhalతో ఉన్న ఫోటోను షేర్ చేసినందుకు గాను అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ లో ఫిల్మ్ మేకర్ Avinash Dasపై కేసు నమోదు చేసింది. ఇది ఐదేళ్ల క్రితం తీసిన ఫోటో అని, ప్రస్తుతం పూజా సింఘాల్ అరెస్ట్ నేపథ్యంలో అమిత్ షా ప్రతిష్టను కించపరిచేలా/పరువు తీసేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చిత్రనిర్మాత ఇప్పుడు దాన్ని షేర్ చేశారని పోలీసులు తెలిపారు.
త్రివర్ణ పతాకాన్ని ధరించిన మహిళ ఫొటోను షేర్ చేసి జాతీయ జెండాను అవమానించినందుకు గానూ దానిపై కూడా దాస్ మీద కేసు నమోదైంది. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చిత్రనిర్మాత దాస్ మే 8న అరెస్టయిన జార్ఖండ్ కేడర్ ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్‌తో షా ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు, అది ఐఏఎస్ అధికారి అరెస్టుకు ముందు తీసినది అని ఆరోపించబడింది.
అమిత్ షా ప్రతిష్టను కించపరిచేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేశారనీ, అమిత్ షా ప్రతిష్టను కించపరిచే ఉద్దేశ్యంతో ఇలా చేశారనీ, త్రివర్ణ పతాకం ధరించిన మహిళ అభ్యంతరకర చిత్రాన్ని దాస్ తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. ఇలా చేయడం మన త్రివర్ణ పతాకాన్ని అవమానించడమేనని వారు అన్నారు.
ఆరాహ్‌ను అనార్కలి చేసిన దాస్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంలో తదుపరి విచారణలు కొనసాగుతున్నాయి. దాస్‌ను విచారణ నిమిత్తం క్రైం బ్రాంచ్‌కు పిలిచే అవకాశం ఉంది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆమె ఇంట్లో అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు వీడియోలు వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉండగా, మే 12న మనీలాండరింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ ను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. జార్ఖండ్ లోని జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల్లో అవకతవకలపై ఈడీ కొన్ని గంటల ముందు ఆమె మీద ప్రశ్నల వర్షం కురిపించింది. నిధుల్లో అవకతవకలు జరిగిన సమయంలో పూజా సింఘాల్ జార్ఖండ్‌లో మైనింగ్ కార్యదర్శగా పనిచేస్తుంది. ఇదే కేసులో కొద్ది రోజుల క్రితం జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, రాజస్థాన్ లలో ఏకకాలంలో పూజా సింఘాల్ సన్నిహితుల ఇంట్లో ఈడీ దాడులు చేసింది.
ఈ దాడిలో ఈడీకి 19 కోట్లకు పైగా నగదు, పలు కీలక పత్రాలు లభించాయి. 19 కోట్ల 31 లక్షల రూపాయల్లో 17 కోట్లను చార్టర్డ్ అకౌంటెంట్ అకౌంట్ నుంచి రికవరీ చేశారు. మిగిలిన డబ్బును ఓ కంపెనీ నుంచి స్వీకరించారు. దీంతో పాటు పలు ఫ్లాట్లలో ఇద్దరూ పెట్టుబడులు పెట్టిన విషయం కూడా తెరపైకి వచ్చింది. దాదాపు 150 కోట్ల పెట్టుబడి పత్రాలు వచ్చాయన్నారు. అందిన సమాచారం మేరకు IAS పూజా సింఘాల్ భర్త అభిషేక్ ఝాకు బారియాతు రోడ్‌లో పల్స్ హాస్పిటల్ ఉందనే విషయం తెలిసిందే.
