సినిమాల్లో అవకాశం కలిపిస్తానంటూ ఓ మహిళను దాదాపు 27 లక్షల మేర మోసం చేసిన సినీ నిర్మాతను కేరళ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేయడంతో నిందితులు ఆమెను బెదిరించడంతో పాటు బాధితురాలి మొబైల్ నెంబర్‌కు అభ్యంతరకరమైన సందేశాలు పంపారు. 

సినిమాల్లో అవకాశం కలిపిస్తానంటూ ఓ మహిళను దాదాపు 27 లక్షల మేర మోసం చేసిన సినీ నిర్మాతను కేరళ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మలప్పురానికి చెందిన షక్కీర్ ఎంకే అనే వ్యక్తిని పలారివట్టం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రిక్కాకరకు చెందిన మహిళ ఫిర్యాదు ప్రకారం.. సినిమా నిర్మాణానికి ఆర్ధిక సమస్యలు వున్నాయని కొందరు వ్యక్తులు నమ్మించి ఆమె నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేశారు. నిధుల కొరత కారణంగా షూటింగ్ ఆకస్మాత్తుగా ఆగిపోయే అవకాశం వుందని సదరు మహిళకు నిర్మాత చెప్పాడు. దీంతో ఆమె 27 లక్షల వరకు అందజేసింది. 

అయితే తనకు కొన్ని అవసరాలు వున్నందున డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేయడంతో నిందితులు ఆమెను బెదిరించడంతో పాటు బాధితురాలి మొబైల్ నెంబర్‌కు అభ్యంతరకరమైన సందేశాలు పంపారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన వలారిపట్టం ఇన్‌స్పెక్టర్ జోసెఫ్ సాజన్ నేతృత్వంలోని పోలీస్ బృందం సైబర్ సెల్ సాయంతో నిందితుడి ఆచూకీ కోసం గాలించింది. నిందితుడు కోజికోడ్‌లో వున్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అరెస్ట్ చేశారు.