లంచ్ బాక్స్ కోసం ఇద్దరు మిత్రులు గొడవ పడ్డారు. ఆ గొడవ చివరికి  ఒకిరిని మరొకరు దారుణంగా హత్య  చేసుకునేదాక దారి తీసింది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా....  ఆ ఇద్దరు మిత్రులు.... నైజీరియాకు చెందినవారు కావడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే..... నైజీరియాకు చెందిన మోరాడో(39), సామ్యూల్(30)లు బెంగళూరులో నివసిస్తున్నారు. కాగా... శామ్యూల్ కేఎన్ఎస్ కాలేజీలో బీబీఏ చదువుతున్నాడు. మోరాడో మాత్రం ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. కాగా...  శుక్రవారం రాత్రి మోరాడో, సామ్యూల్ ఇద్దరూ  ఓ కామన్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్లారు. హున్నూర్ లోని ఓ కామన్ ఫ్రెండ్ ఇంట్లో శనివారం వరకు ఉన్నారు.

శనివారం మధ్యాహ్నం  సామ్యూల్ మోరాడో లంచ్ బాక్స్ తీసుకొని వెళ్లి...సమీపంలోని  ఓ ఫుడ్ కోర్టుకి వెళ్లి చికెన్ తెచ్చుకోవడానికి వెళ్లాడు. అక్కడ లంచ్ బాక్స్ మర్చిపోయి.... వేరే పార్శిల్ లో చికెన్ తెచ్చుకున్నాడు. తన లంచ్ బాక్స్ పోగొట్టాడనే కోపంతో... మోరాడో.. సామ్యూల్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. అభ్యంతరకర పదాలతో ధూషించి.. చెంప పగలగొట్టాడు.

ఓ లంచ్ బాక్స్ కోసం తనను మోరాడో తిట్టడం, కొట్టడాన్ని  సామ్యూల్ తట్టుకోలేకపోయాడు. ఇంటికి వెళ్లాక కూడా తనకు అదే గుర్తుకు వచ్చింది. దీంతో ఆవేశంతో....  ఆదివారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో మోరాడో ఇంటికి వెళ్లాడు. తనను కొట్టినందుకు క్షమాపణలు చెప్పాలంటూ డోరు గట్టిగా బాదాడు. దీంతో... మోరాడో తన ఇంటి తలుపులు తెరవగానే.... కోపంతో ఉన్న సామ్యూల్... కత్తి తీసుకొని పొట్టలో , ఛాతి మీద పొడిచేశాడు. దీంతో... తీవ్రగాయాలపాలై మోరాడో చనిపోయాడు.

అయితే...వీరిద్దరు గట్టిగా గొడవ పడుతుండటంతో.... స్థానికులు ముందు జాగ్రత్తగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సరిగి మోరాడో చనిపోయి ఉన్నాడు. కాగా సామ్యూల్... కిచెన్ లో దాక్కొని ఉన్నాడు. అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.