పదిరూపాయల వివాదం చివరికి హత్యకు దారితీసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో కలకలం సృష్టించింది. ఈ నిందితుడిని 15 రోజుల తరువాత అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లోని మెయిన్‌పురిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కేవలం రూ.10 కోసం చెలరేగిన వివాదం ఓ దుకాణదారుని ప్రాణాలు తీసింది. అతడిని దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు - మహేశ్‌చంద్ జాతవ్, దళితుడు. అతను తన తాత్కాలిక దుకాణం వెలుపల నిద్రిస్తుండగా, నిందితుడు గుల్ఫామ్ అలియాస్ గుల్లా బంజారా అతని తలపై కాల్చాడు.
జూన్ 12న ఈ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన పక్షం రోజుల తర్వాత మంగళవారం జూన్ 27,గుల్ఫామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, జాతవ్ తన దుకాణంలో పెట్రోల్‌తో పాటు ఇతర వస్తువులను విక్రయించేవాడని గుల్ఫామ్ వెల్లడించాడు.
'జమ్మూకాశ్మీర్ ఆణిముత్యం.. నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు గ్రహీత ఫిర్దౌసా జాన్'
ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు గుల్ఫామ్ జాతవ్ దగ్గర పెట్రోల్ కొనుగోలు చేశాడు. డబ్బులు ఇచ్చాడు.. అయితే గుల్ఫామ్ ఇచ్చిన డబ్బుల్లో పది రూపాయలకు తక్కువయ్యాయి. ఈ విషయాన్ని జాతవ్.. గుల్ఫామ్ ను నిలదీశాడు.
బ్యాలెన్స్ మొత్తం ఇవ్వాలంటూ గుల్ఫామ్ జాతవ్‌ను అడిగాడు. కానీ, అతను దానికి నిరాకరించాడు, ఇది వారి మధ్య వాగ్వాదానికి దారితీసింది. మహేశ్‌చంద్ జాతవ్.. గుల్ఫామ్‌ను డబ్బులు మొత్తం ఇవ్వకపోతే అంతుచూస్తా అని బెదిరించాడని నిందితులను విచారించిన తర్వాత పోలీసులు తెలిపారు. జాతవ్ బెదిరించడంతో, గుల్ఫామ్ తీవ్ర కోపానికి వచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. జూన్ 12 రాత్రి జాతవ్‌ను కాల్చి చంపాడు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని మన్యం జిల్లా పాలకొండలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 10 రూపాయల కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడిచాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఆటో డ్రైవర్ పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
జూన్ 5 సాయంత్రం కోటదుర్గ ఆలయ కూడలి దగ్గర నలుగురి యువకులు కాంప్లెక్స్ కు వెళ్లాలని చెప్పి ఆటో ఎక్కారు. ఆటో పాలకొండకు చెందిన శ్రీనివాస్ రావు అనే వ్యక్తిది. మనిషికి పది రూపాయల చొప్పున చెల్లిస్తామని ముందే శ్రీనివాసరావు తో బేరం కుదుర్చుకున్నారు. అయితే దిగే టైం వచ్చేసరికి మాత్రం తక్కువ తీసుకోవాలంటూ వాగ్వాదానికి దిగారు.
అదే సమయంలో ఓ యువకుడు తన జేబులో ఉన్న కత్తిని తీసుకొని శ్రీనివాసరావు పొట్టపై పోటు పొడి చేశాడు. ఇది గమనించిన సమీపంలో ఉన్నవారు వెంటనే స్పందించారు. ఆ నలుగురిని పారిపోకుండా పట్టుకున్నారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఆ తర్వాత బాధితుడైన ఆటో డ్రైవర్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మీద ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
