పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ కోసం ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు. కత్తులతో పొడుచుకొని ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని అరియలూరు జిల్లా తిరుమళంపాడి మారియమ్మన్‌ ఆలయ వీధికి చెందిన నటరాజన్‌ కుమారుడు రాజరాజన్‌ (28)అవివాహితుడు. అతనికి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. అనంతరం అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్ని రోజుల పాటు వారి బంధం అలాగే కొనసాగింది.  ఈ క్రమంలోనే ఆమెకు అదే పాఠశాలలో పని చేస్తున్న హెన్రి (40) అనే ఉపాధ్యాయుడితో స్నేహం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ సంగతి రాజరాజన్‌కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే హెన్రీ, రాజరాజన్‌ల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. హెన్రీ మద్దతుదారులు రాజరాజన్‌పై కట్టెలతో దాడి చేసి కత్తులతో పొడిచి గాయపరిచారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హెన్రీని అరెస్టు చేశారు. ఘటనపై మరింత విచారణ జరుపుతున్నారు. ఉపాధ్యయురాలిని విచారిస్తున్నారు.