ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. ఆపరేషన్ గంగ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తీసుకొస్తుంది. తాజాగా Ukraineలో చిక్కుకుపోయిన భారతీయులతో కూడిన ఐదో విమానం భారత్‌కు చేరుకుంది.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. ఆపరేషన్ గంగ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తీసుకొస్తుంది. తాజాగా Ukraineలో చిక్కుకుపోయిన భారతీయులతో కూడిన ఐదో విమానం భారత్‌కు చేరుకుంది. ఈ విమానం రొమేనియా రాజధాని బుకారెస్ట్ (Bucharest in Romania) నుంచి బయలుదేరి ఈ రోజు ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 249 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న భారతీయులు.. భారత ఎంబసీ అధికారుల కృషిని ప్రశంసించారు. అయితే ఉక్రెయిన్ సరిహద్దు దాటడమే అతిపెద్ద సమస్య అని ఇండియాకు చేరుకున్న పలువురు విద్యార్థులు చెప్పారు.
‘ప్రభుత్వం మాకు చాలా సహాయం చేసింది. భారత రాయబార కార్యాలయం ద్వారా సాధ్యమైన అన్ని సహాయాలు అందించబడ్డాయి. ప్రధాన సమస్య సరిహద్దు దాటడం. భారతీయులందరినీ తిరిగి తీసుకువస్తారని నేను ఆశిస్తున్నాను. ఉక్రెయిన్‌లో ఇంకా చాలా మంది భారతీయులు చిక్కుకుపోయారు’ అని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఓ విద్యార్థి చెప్పారు.
ఇక, ఉక్రెయిన్-రష్యా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరుతో స్వదేశానికి తరలిస్తుంది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారిని సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరిలకు చేరేలా ఏర్పాట్లు చేసి.. అక్కడి నుంచి తరలింపు ప్రక్రియ చేపడున్నారు. రొమేనియా రాజధాని బుకారెస్ట్, హంగేరి రాజధాని బుడాపెస్ట్‌ల నుంచి భారత్‌కు ఎయిర్ ఇండియా ద్వారా ప్రత్యేక విమానాలను నడుపుతుంది. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు ఎలాంటి వీసా లేకపోయినా తమ దేశంలోకి రావొచ్చని పోలాండ్ తెలిపిన సంగతి తెలిసిందే.
ఆపరేషన్ గంగాలో భాగంగా.. తొలి విమానం రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి 219 మంది భారతీయలుతో శనివారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. రెండో విమానం రెండో విమానం ఆదివారం తెల్లవారుజామున Delhi airportకు చేరుకుంది. ఇందులో 250 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. మూడో విమానం హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్ నుంచి బయలుదేరి ఆదివారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఇందులో 240 మంది ఇండియన్స్ ఉన్నారు. నాలుగో విమానం బుకారెస్ట్ నుంచి 198 మంది భారతీయలుతో ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరింది. ఇంకా 13 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక, ఎంబసీ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు చెక్‌పోస్టులకు వెళ్లవద్దని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయులకు సూచించింది. భారతీయులు తమ పాస్‌పోర్ట్‌లు, నగదు (ప్రాధాన్యంగా US డాలర్లలో), ఇతర అవసరమైన వస్తువులు, COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లను వారి వెంట ఉంచుకోవాలని తెలిపింది.
