Asianet News TeluguAsianet News Telugu

కరోనా నుంచి కోలుకోవడానికి 130రోజులు పట్టింది..!

 వైరస్ సోకిన తొలి నాళ్లలో ఆయన ఆక్సీజన్ స్థాయి16కు పడిపోయింది

Feels Great To Be Back Home: Covid Patient Discharged After 130 Days
Author
Hyderabad, First Published Sep 16, 2021, 3:26 PM IST

కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఓ వ్యక్తి  ఆ మహమ్మారి బారిన పడ్డాడు. అయితే.. ఆ మహమ్మారి  నుంచి కోలుకోవడానికి అతనికి దాదాపు 130 రోజులు పట్టిందట. తన కళ్ల ముందే ఎంతో మంది కరోనా బాధితులు చనిపోతున్నా.. మనో ధైర్యంతో వైరస్ ను జయించగలిగాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ: లోని మేరఠ్ కు చెందిన 39ఏళ్ల విశ్వాస్ సైని ఈ ఏడాది ఏప్రిల్ 28న కరోనా సోకింది. తొలుత హోం ఐసోలేషన్  లో ఉన్నారు. అయితే.. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. వైరస్ సోకిన తొలి నాళ్లలో ఆయన ఆక్సీజన్ స్థాయి16కు పడిపోయింది. దీంతో దాదాపు నెల రోజులు వెంటిలేటర్ పై ఉన్నారు. అయినప్పటికీ మనో ధైర్యం  కోల్పోలేదు. అలా ఏకంగా 130 రోజుల తర్వాత వైరస్ తో పోరాడి విజయం సాధించారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు.

ఇన్ని రోజుల తర్వాత ఇంటికి రావడం తనకు ఆనందంగా ఉందని.. మళ్లీ కుటుంబసభ్యులతో కలిసి గడుపుతానని అస్సలు ఊహించలేదని ఆయన పేర్కొనడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios