హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత..
ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ తమిళనాడులోని చెన్నైలో గురువారం తుదిశ్వాస విడిచారు.

చెన్నై : హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ తమిళనాడులోని చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 98యేళ్ల స్వామినాథన్ చెన్నైలోని ఇంట్లోనే కన్నుమూశారు. స్వామినాథన్ ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేశారు. దీనికోసం మేలైన వరి వంగడాలను సృష్టించారు. హరిత విప్లవ పితామహుడిగా పేరుపొందారు. స్వామినాథన్. స్వామినాథన్ కృషికి గానూ.. పద్మశ్రీ, పద్మభూషన్, పద్మవిభూషన్, రామన్ మెగాసెసే అవార్డులు ఆయనను వరించాయి.