గత బుధవారం ఆ మహిళను ఢిల్లీలోని Shahdaraలోని ఆమె ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసిన తరువాత ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన కుటుంబానికి చెందిన ఓ 14 యేళ్ల బాలుడు ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడగా... ఆమె దానికి నిరాకరించింది. దీంతో గత నవంబర్ లో ఆ బాలుడు ప్రేమతిరస్కరించిందని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఆమె ఆ ప్రాంతం నుంచి కాస్త దూరంగా వెళ్లిపోయింది. అయితే బాలుడి suicideకు ఆమె కారణం అంటూ.. ఆ కుటుంబసభ్యులు పగ బట్టారు.

న్యూఢిల్లీ : గత వారం ఢిల్లీలో వెలుగు చూసిన మహిళ kidnap, gang rape, గుండు కొట్టించి, చెప్పులదండ వేసి, ముఖానికి నల్లరంగు వేసి ఊరేగించినన 20 యేళ్ల వివాహిత, ఒక చిన్నారి తల్లి వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమె ఇంకా ఘటన తాలూకు షాక్ నుంచి, గాయాలు నుండి కోలుకుంటోంది. అయితే ఆమెను ఆమె కుటుంబసభ్యులు మూడేళ్ల కొడుకు నుండి దూరంగా ఉంచారు. ప్రస్తుతం ఆమె తన బిడ్డను చూసుకునే మానసిక స్థితిలో లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

గత బుధవారం ఆ మహిళను ఢిల్లీలోని Shahdaraలోని ఆమె ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసిన తరువాత ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన కుటుంబానికి చెందిన ఓ 14 యేళ్ల బాలుడు ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడగా... ఆమె దానికి నిరాకరించింది. దీంతో గత నవంబర్ లో ఆ బాలుడు ప్రేమతిరస్కరించిందని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఆమె ఆ ప్రాంతం నుంచి కాస్త దూరంగా వెళ్లిపోయింది. అయితే బాలుడి suicideకు ఆమె కారణం అంటూ.. ఆ కుటుంబసభ్యులు పగ బట్టారు. ఘటన జరిగిన కస్తూర్బా నగర్‌లో ఆమె మీద దాడిచేసిన వారిలో ఎక్కువగా మహిళలు,యువకులే ఉన్నారు. ఇంకా ఆమెపై దాడి చేసిన వారిలో ఎక్కువగా అబ్బాయి కుటుంబానికి చెందిన వారు ఉన్నారు.

ఈ ఘటనలో పన్నెండు మందిని అరెస్టు చేశారు. వీరిలో ఎనిమిది మంది మహిళలు మరియు నలుగురు పురుషులు ఉన్నారు. ఆ మహిళను గంటల తరబడి వేధించి, లైంగికంగా దాడి చేసిన క్రూరత్వాన్ని వీడియోలు చూపుతున్నాయి.

ఒక వీడియో అయితే, స్పష్టంగా ఆమె నిర్బంధించబడిన గదిలో చిత్రీకరించబడింది. అందులో ఆమె మీద తీవ్రంగా దాడి చేస్తున్నారు. పక్కనుంచి ఆమెపై ఎలా దాడి చేయాలో చెబుతున్న గొంతులు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆమెను కొట్టడం, తన్నడంలో చిన్నపిల్లలు కూడా చేరతారు. తనను వదిలేయమని ఆమె అరుస్తుంటే... అవేమీ పట్టించుకోకుండా ఓ మహిళ ఆమె జుట్టును కత్తిరించడం కూడా ఇందులో కనిపిస్తుంది. అంతేకాదు ఆమె మీద దాడి చేస్తున్న వారికి మహిళలు అండగా నిలవడంతో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది.

మరొక వీడియోలో ఆమెను కొడుతూ.. పదే పదే కొట్టినందుకు చీర్స్ చెప్పుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటూ గుంపు ఆమెను వీధిలో ఈడ్చుకెళ్లినట్లు కనిపిస్తుంది. 

ఏ ఆడకూతురికీ ఇలా జరగకూడదు...
దీనిమీద బాధితురాలి తండ్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ‘ఏ ఆడపిల్లకు, ఏ కూతురికీ ఈ పరిస్థితి రాకూడదు. ఏ వీధిలోనో, ఏ ప్రాంతంలోనూ ఇలా జరగకూడదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పక్షవాతానికి గురై మంచానికే పరిమితం అయ్యాడు. 

"ఆమె కొట్టిన విధానం, గాయపడిన తీరు, ఆమెను దోషిగా చిత్రీకరిస్తుంది. కానీ నేను న్యాయం గురించి పట్టించుకోను, నా కుమార్తె ఇంటికి తిరిగి రావాలి," అని వణుకుతున్న గొంతుతో చెబుతున్నాడు. కుటుంబం మొత్తంలో ఒక్కరు కూడా ఆమెకు సాయం చేయడానికి రాలేదని, భయంకరమైన దాడిని ఆపడానికి ప్రయత్నించలేదని వాపోయాడు. 

'బీజేపీకి చెందిన గౌతమ్‌ గంభీర్‌, కాంగ్రెస్‌ నుంచి అనిల్‌ చౌదరిలు మా దగ్గరికి వచ్చి పరామర్శించారు. మేము అడగకుండానే మాకు రెండు నెలల రేషన్‌ కూడా ఇచ్చారు. మాకు మద్దతు, సహాయం అందిస్తున్నారు. అడిగినా సాయం చేయని ఈ రోజుల్లో ఎవరు ఇలా సహాయం చేస్తారు? అని తండ్రి చెప్పుకొచ్చాడు. 

ఆమెకు సాయం చేస్తే..పరిస్థితి ఇలా మారేది కాదు.. 
బాధితురాలి సోదరి మాట్లాడుతూ.. బాలుడు చనిపోవడానికి మా సోదరిని నిందించారంటూ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో చుట్టూ ఉన్నవాళ్లు కాస్త మా సోదరికి సాయం అందిస్తే, దాడిని వ్యతిరేకిస్తే ఇంత దారుణం జరిగిదేది కాదు.. ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం.. అంటూ చెప్పుకొచ్చింది. 

ఖండించిన పోలీసులు...
ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో దాడికి గురైన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్న పుకార్లు షికార్లు చేస్తుండడంతో దీనిని ఢిల్లీ పోలీసులు ఖండించారు. కెనడా, యుకె, యుఎస్‌లకు చెందిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు ఇలాంటి సున్నితమైన సంఘటనలను వాడుకుని హింసను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మనుషులుగానే పరిగణించరు...
దేశ రాజధానిలో ఇలాంటి ఘటనల మీద పలువురు రాజకీయ నాయకులు స్పందించారు. దీనిమీద కాంగ్రెస్ అధినేత రాహుల్‌ గాంధీ స్పందిస్తూ ‘20 ఏళ్ల మహిళను దారుణంగా కొట్టిన వీడియో మన సమాజపు వికృత కోణాన్ని బహిర్గతం చేస్తోంది. చాలా మంది భారతీయులు మహిళలను మనుషులుగా పరిగణించరు అనే చేదు నిజం బయటపెడుతోంది. ఈ సిగ్గుచేటైన వాస్తవాన్ని గుర్తించి, బయటకు చెప్పాలి’ అని ట్వీట్‌ చేశారు.

దీనిమీద పోలీసు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామని బీజేపీ నేత గౌతమ్ గంభీర్ తెలిపారు. "ఈ జంతువులను (దాడిచేసిన పురుషులు, మహిళలు) విడిచిపెట్టమని నేను హామీ ఇస్తున్నాను. ఈ ఘటనలో బాధితురాలికి అన్ని రకాల సహాయాన్ని అందిస్తాం" అని బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇది సిగ్గుమాలిన ఘటన అని వ్యాఖ్యానించారు."ఇంత దారుణానికి తెగబడడానికి నిందితులు ఎలా ధైర్యం చేశారు? కేంద్ర హోం మంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్‌ను కఠిన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలపై మరింత దృష్టి పెట్టాలని పోలీసులను ఆదేశించాలని కోరుతున్నాను. ఢిల్లీ ప్రజలు ఇలాంటి నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు." అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.