కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కాల యముడయ్యాడు. కుమార్తె ప్రేమలో పడిన విషయాన్ని తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోతూ ఆమెను దారుణంగా హత్య చేశాడు.
కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కాల యముడయ్యాడు. కుమార్తె ప్రేమలో పడిన విషయాన్ని తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోతూ ఆమెను దారుణంగా హత్య చేశాడు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం మధురై వండియూరు సంగునగర్‌కు చెందిన ఆశైతంబి ఆటోడ్రైవర్. ఇతని కుమార్తె మీనాక్షి దేవి (26) జైహింద్‌పురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తోంది.
ఈ క్రమంలో మీనాక్షీ దేవి ఓ కుర్రాడితో ప్రేమలో పడ్డట్లు తెలియడంతో తండ్రి తీవ్రంగా మందలించాడు. అయినప్పటికీ మీనాక్షీ దేవి తండ్రి హెచ్చరికను లక్ష్యపెట్టక.. ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించడంతో ఆశైతంబి ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో మీనాక్షీ దేవి శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఆశైతంబి చపాతి కర్రతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.