ఒక్కొగానొక్క కూతురిని ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. అల్లారుముద్దుగా పెంచిన కూతురిని పెళ్లీడుకొచ్చాక ఓ మంచి కుర్రాడిని వెతికి ఘనంగా పెళ్లి చేశారు. కూతురు, అల్లుడు సంతోషంగా ఉంటే చాలు అని అనుకున్నారు. అయితే.. పెళ్లి తర్వాత కూతరు దారితప్పింది. భర్తతో ప్రేమగా ఉండాల్సింది పోయి.. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో తట్టుకోలేకపోయిన ఆమె తండ్రి కూతురిని చంపేశాడు. ఈ సంఘటన  కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Also Read మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. చంపేసి బస్తాలో మూటగట్టి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బళ్లారి తాలుకా గోడేహళ్ గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి వ్యసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని కి ఒక్కొక్కగానొక్క కుమార్తె కవిత(22). చాలా ప్రేమగా పెంచాడు. గోపాల్‌రెడ్డి కుమార్తె కవితకు నాలుగేళ్ల క్రితం జిల్లాలోని సండూరు తాలూకా కురెకుప్ప గ్రామానికి చెందిన యువకునితో పెళ్లి చేశారు.

 అయితే కవితకు అక్కడే ప్రకాశ్‌ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. రెండు నెలల నుంచి భర్తను వదలి ప్రియునితో ఉంటోంది. కవిత భర్త.. భార్య కనిపించడం లేదని తోరణగల్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల కవిత పుట్టింటికి వచ్చింది. 

ప్రియుడు కూడా వచ్చి కవితను తనతో రావాలని గొడవకు దిగడం జరిగింది. ఈ సంఘటనతో తండ్రి గోపాలరెడ్డి ఎంతో మథన పడ్డారు. సోమవారం రాత్రి కూతురితో ఆయన ఘర్షణ పడ్డాడు. ఈ గొడవలో ఆమె విగతజీవిగా మారింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.